గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 విజేతగా ప్రముఖ భారతీయ కళాకారిణి రౌబుల్ నాగి

రిపోర్టర్: రాము స్థలం: Dubai

ప్రఖ్యాత జీమ్స్ ఎడ్యుకేషన్ గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026 పురస్కారానికి భారతీయ కళాకారిణి రౌబుల్ నాగి ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో ఒక మిలియన్ డాలర్ల విలువైన ఈ పురస్కారాన్ని ప్రకటించారు. వందలాది దేశాల నుంచి ఐదు వేలకు పైగా నామినేషన్లు రాగా ఆమె ఈ ఘనత సాధించారు. అట్టడుగు వర్గాల పిల్లలకు విద్యనందించడంలో విశేష కృషి చేసినందుకు ఈ అంతర్జాతీయ పురస్కారం దక్కిందని వెల్లడించారు.