నవోదయ విద్యాలయంలో ప్రవేశాలకై ఆన్లైన్ దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: మర్రిపాడు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కృష్ణాపురం నందుగల జవహర్ నవోదయ విద్యాలయంలో 2027-2028 విద్యా సంవత్సరంలో తొమ్మిదవ తరగతి మరియు పదకొండవ తరగతిలో ప్రవేశాల కొరకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ చెన్నయ్య తెలిపారు. ఈ ప్రవేశాల నిమిత్తం 2027 ఏప్రిల్ 10వ తేదీన రాత పరీక్ష నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.