తమిళనాడు అసెంబ్లీలో విజయ్, స్టాలిన్ మధ్య తీవ్ర వాగ్వాదం
రిపోర్టర్: సతీష్
స్థలం: తమిళనాడు
తమిళనాడు శాసనసభలో సీఎం విజయ్, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ మధ్య మీసా చట్టం సైగల వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. జైలులో తన దవడ ఎముక విరిగిన వైనాన్ని స్టాలిన్ గుర్తుచేస్తూ విజయ్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చారు. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీని రీల్స్ చేసే స్థలంగా మార్చవద్దని స్టాలిన్ హితవు పలకడంతో తమిళనాట రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది.