అర్నబ్ తుపాను ప్రభావం: శ్రీకాకుళంలో జారిపడిన వలస పక్షులను కాపాడిన యువకులు

రిపోర్టర్: రమేష్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం తేలుకుంచి విడిది కేంద్రంలో అర్నబ్ తుపాను ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వలస పక్షులు చెట్ల నుంచి జారిపడి విలవిల్లాడాయి. ఈ విషయాన్ని గమనించిన గ్రామ యువకులు వెంటనే స్పందించి వాటిని రక్షించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి, బాధిత పక్షులను సంరక్షణ కేంద్రానికి తరలించి ప్రత్యేక వసతి కల్పించినట్లు అధికారులు తెలిపారు.