ఓం చాప్టర్ 1: ఉదిరం సినిమా నుంచి వీర వీర పాట విడుదల
రిపోర్టర్: శివ
స్థలం: హైదరాబాద్
వర్సటైల్ స్టార్ ధనుష్ హీరోగా రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం చాప్టర్ 1 ఉదిరం సినిమా నుంచి వీర వీర రెండో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసిందని సినీ వర్గాలు వెల్లడించాయి. సాయి అభ్యంకర్ సంగీతం అందించిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోందని తెలిపారు. పాన్ ఇండియా స్థాయిలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని పేర్కొన్నారు.