విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కేసులు పెట్టిస్తానంటూ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరిక
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆదిలాబాద్
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే బాధితులతో సంబంధిత వైద్యులపై కేసులు పెట్టిస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. రిమ్స్‌లో జరిగిన ప్రమాద ఘటన నేపథ్యంలో డైరెక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి ఆయన వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ.11.10 కోట్లు విడుదల కాగా, మరిన్ని నిధుల కోసం ప్రభుత్వంతో మాట్లాడతామని, వ్యవస్థ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు.