కోల్‌కతాలో బ్రెజిల్ దిగ్గజం కాఫు పర్యటన

రిపోర్టర్: శివ స్థలం: పశ్చిమ బెంగాల్

భారత్‌లో జరిగే అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌కు ముందు బ్రెజిల్ మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు కాఫు కోల్‌కతాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డియగో మరగోనాతో ఆడాలని ఉందని, పిర్లో లాంటి ఫుట్‌బాల్ మేధస్సు ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. భారత ఫుట్‌బాల్ ఆటగాళ్లు తమపై తమకు నమ్మకం ఉంచాలని కాఫు సూచించారు.