ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కు భారీ షాక్: ప్రయాణికులకు పరిహారం చెల్లించాలని కమిషన్ ఆదేశం

రిపోర్టర్: రాము స్థలం: Chandigarh

దుబాయ్ వరదల సమయంలో విమాన ప్రయాణానికి అనుమతించని ఘటనలో ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ మరియు యాప్రా ఆన్ లైన్ సంస్థలదే తప్పిదమని చండీగఢ్ రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. ప్రయాణికులకు ముందుగా సమాచారం ఇవ్వనందుకు సర్వీస్ లోపం కింద రూ. 1.88 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించినట్లు కమిషన్ వెల్లడించింది. ఈ మేరకు జిల్లా కమిషన్ ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అప్పీల్ ను డిస్మిస్ చేసినట్లు అధికారులు తెలిపారు.