ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు

రిపోర్టర్: శివ స్థలం: న్యూఢిల్లీ

ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓట్ల తొలగింపు వ్యవహారం భారత ప్రజలపై, రాజ్యాంగంపై జరిగిన ప్రత్యక్ష దాడి అని ఆయన మండిపడ్డారు. ఈ వ్యవహారంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో పాటు ఎన్నికల సంఘం కూడా కుట్రలో భాగస్వామ్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ న్యాయం జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.