రైల్వే ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్: ఏఎల్పీ సీబీటీ-1 అడ్మిట్ కార్డులు విడుదల

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తీపి కబురు అందించింది. ఏఎల్పీ సీబీటీ-1 పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను తాజాగా విడుదల చేసినట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 3 నుంచి 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ప్రాంతీయ వెబ్సైట్ల ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 11,127 ఖాళీల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.