ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొలగింపునకు డిమాండ్: సీపీఎం ఆందోళన

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు(ఎం)

ప్రజాస్వామ్యంలో పౌరుల ఓటు హక్కును కాలరాస్తున్న కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ను వెంటనే తొలగించాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల బిక్షం డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) కేంద్రంలో శివాజీ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టాయి. ఢిల్లీలోని జంతర్మంతర్ ధర్నాకు వెళ్తున్న వామపక్ష నేతలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసించారు. ఓట్ల తొలగింపు విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు.