ఇజ్రాయెల్ ఎన్నికల ఫలితాలపై నేతన్యాహు ధ్వజం: అరబ్ పార్టీలపై తీవ్ర విమర్శలు

రిపోర్టర్: సతీష్ స్థలం: జెరూసలేం

ఇజ్రాయెల్ దేశ పార్లమెంట్ ఎన్నికల్ లో అరబ్ పార్టీలు రికార్డు స్థాయిలో పందొమ్మిది స్థానాలను కైవసం చేసుకోవడంపై ఆ దేశ ప్రధాన మంత్రి బెంజమిన్ నేతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరబ్ రాజకీయ పార్టీలు హమాస్ సానుభూతిపరులని ఆయన ఆరోపించారు. వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం దేశ భద్రతకు పెను ముప్పు అని బెంజమిన్ నేతన్యాహు హెచ్చరించినట్లు అల్ జజీరా మీడియా తెలిపింది.