మురసు తుఫాను భయంతో వణికిపోతున్న నర్సంపేట పత్తి రైతులు
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
మురసు తుఫాను ప్రభావంతో నర్సంపేట పట్టణంలో ఆకాశం మేఘావృతమైంది. మంగళవారం ఉదయం పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. తుఫాను కారణంగా భారీ వర్షం పడితే పత్తి పంట దెబ్బతిని తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పంట చేతికొచ్చే దశలో ఉందని, వర్షం కురిస్తే దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.