క్రేజీ కల్యాణం సినిమా విశేషాలు వెల్లడించిన నటుడు నరేశ్

రిపోర్టర్: అశోక్ స్థలం: Hyderabad

తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య జరిగే భావోద్వేగాల పోరాటమే క్రేజీ కల్యాణం సినిమా ప్రధానాంశమని నటుడు డాక్టర్ నరేశ్ విజయకృష్ణ తెలిపారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమా ఈ నెల పదహారున విడుదల కానుందని చెప్పారు. ఇందులో తాను ప్రధాన పాత్ర పోషిస్తున్నానని, దర్శకుడు బద్రప్ప ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారని పేర్కొన్నారు. తెలంగాణ నేపథ్యంతో వస్తున్న ఈ కుటుంబ కథా చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.