చాముండేశ్వరి అమ్మవారి హుండీ ఆదాయం రూ.6.82 లక్షలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: నెల్లూరు
ఇందుకూరుపేట మండలం గంగపట్నం శ్రీచాముండేశ్వరి అమ్మవారి దేవస్థానంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. రెండు నెలల పన్నెండు రోజులకు హుండీ కానుకల ద్వారా రూ.6,82,137 మరియు అన్నదానం ద్వారా రూ.87,358 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఛైర్మన్ గుండాల కృష్ణారెడ్డి, ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. భక్తులు, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో ఈ లెక్కింపు పారదర్శకంగా చేపట్టారు.