ఆదోనిలో ఘనంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహణ

రిపోర్టర్: నరేష్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ర్యాలీ నిర్వహించారు. స్థానిక కార్యాలయంలో పురపాలక కమిషనర్ నయూమ్ అహ్మద్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహ కూడలి వరకు ర్యాలీ కొనసాగింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛతకు సహకరించి పట్టణాభివృద్ధికి దోహదపడాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.