జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం: దుకాణాలు దగ్ధం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: జమ్మూ

జమ్మూ రైల్వే స్టేషన్ సమీపంలోని శివ మార్కెట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో పదిహేనుకు పైగా దుకాణాలు, ఒక హోటల్ పూర్తిగా కాలి బూడిదయ్యాయని అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి సంభవించిన ఈ ప్రమాదంలో మంటలు వేగంగా వ్యాపించడంతో వందలాది మంది వ్యాపారులు తమ ఉపాధిని కోల్పోయారని పేర్కొన్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రత్యక్ష సాక్షులు భావిస్తుండగా, ఆస్తినష్టం కోట్ల రూపాయలలో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.