మత్స్యకారుల రక్షణకు శాశ్వత చర్యలు: వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం

రిపోర్టర్: రమేష్ స్థలం: ಕಾకినాడ

తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలకు శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని, వేట పడవలకు బీమా సౌకర్యం కల్పించేలా తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కాకినాడ జిల్లాలో తుపాను ప్రభావంపై నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీపావళి తర్వాత మత్స్యకార గ్రామాల్లో పర్యటించి సమస్యలు స్వయంగా అధ్యయనం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.