భక్తిపారవశ్యంతో పులకించిన పాల్వాయి వినాయక మండపాలు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: గుర్రంపోడు
గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామంలో జెడ్పీ హైస్కూల్ గల్లీ గణేష్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పురోహితులు నిమ్మగడ్డ సత్యనారాయణ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో వెంకటాపురం అచ్చాలు, అలివేలు దంపతులు ముఖ్య యజమానులుగా పాల్గొని స్వామివారికి భక్తితో ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ వేడుకల్లో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులందరికీ నిర్వాహకులు తీర్థప్రసాదాలను ఘనంగా పంపిణీ చేశారు.