నేలకొండపల్లిలో ఘనంగా గర్భిణుల సీమంతాలు మరియు చిన్నారుల అక్షరాభ్యాసం
రిపోర్టర్: kasanivenkatesh
స్థలం: నేలకొండపల్లి
నేలకొండపల్లి ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం కార్యక్రమంలో గర్భిణులకు సీమంతం, చిన్నారులకు అక్షరాభ్యాసం వేడుకగా నిర్వహించారు. సూపర్వైజర్ నాగమణి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొని పౌష్టికాహారం ఆవశ్యకతను వివరించారు. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా మాతృ, శిశు మరణాలను అరికట్టవచ్చని, అంగన్వాడీ సేవలపై గర్భిణులు పూర్తి అవగాహన పెంచుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.