బాహుదా వరద బీభత్సం: బాహ్య ప్రపంచంతో తెగిన నాలుగు గ్రామాల సంబంధాలు
రిపోర్టర్: విజయ్
స్థలం: శ్రీకాకుళం
అర్నబ్ తుపాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో భారీ వరదలు ముంచెత్తాయని, బహుదా నది ఉప్పొంగడంతో ఇచ్ఛాపురం మండలంలో నాలుగు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని స్థానికుడు శివం గణపతి ఆవేదన వ్యక్తం చేశారు. డొంకూరు, పెద్దలక్ష్మీపురం, చిన్నలక్ష్మీపురం, శివకృష్ణాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో సుమారు నాలుగు వేల మంది ప్రజలు ఐదు రోజులుగా చీకట్ లో మంచినీరు, నిత్యావసరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.