సోషల్ మీడియా వేధింపుల కేసు: నటుడు ధనుంజయ్పై పోలీసులకు నటి ఫిర్యాదు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
సోషల్ మీడియా వేదికగా తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ నటుడు ధనుంజయ్పై ఓ నటి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. ది ట్రైటర్స్ రియాలిటీ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ధనుంజయ్, తనపై అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ మానసిక క్షోభకు గురిచేస్తున్నాడని బాధితురాలు ఆరోపించారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి, ఆన్లైన్ వేధింపుల కోణంలో దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం అందింది.