గ్రామానికి బస్సు రాక అల్లాడిపోతున్న తూర్పుగూడెం ప్రజలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఆలేరు

ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామానికి గత మూడు సంవత్సరాల కాలంగా పల్లెవెలుగు బస్సు రాకపోవడంతో గ్రామ ప్రజలు మరియు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలేరు నుంచి తూర్పుగూడెం గ్రామానికి ఉదయం 8 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బస్సులు వచ్చే విధంగా ప్రభుత్వం మరియు ఆర్టీసీ అధికారులు తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.