ఆగివున్న వ్యాన్ ను ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

రిపోర్టర్: andluri ganesh స్థలం: గజపతినగరం

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరిపల్లి గ్రామ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మానాపురం నుంచి గజపతినగరం వైపు బైక్ పై వస్తున్న మీసాలపేట గ్రామానికి చెందిన గంట్యాడ రోహిత్ కుమార్ అనే ఇరవై ఒకే ఏడాది యువకుడు రోడ్డు పై నిలిపి ఉన్న వ్యాన్ ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు.