రాష్ట్రంలో మూడు లక్షల ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంలో చంద్రబాబు శ్రీకారం
రిపోర్టర్: మహేష్
స్థలం: Guntur
రాష్ట్రంలో మూడు లక్షల గృహాల నిర్మాణానికి గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం శంకుస్థాపన చేశారు. పేదలకు సొంతిల్లు ఉంటే ఆత్మగౌరవం పెరుగుతుందని, 2029 నాటికి అందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మరో ఆరు లక్షల ఇళ్ల మంజూరుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.