జేఈఈ మెయిన్ 2027 జనవరి సెషన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: న్యూఢిల్లీ
జేఈఈ మెయిన్ 2027 జనవరి సెషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 22వ తేదీలోగా అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రెండు విడతలుగా ఈ పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు. తొలి విడత జనవరిలో, రెండో విడత ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఆలస్య రుసుముతో నవంబర్ 26 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.