బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు

రిపోర్టర్: హరి స్థలం: Andhra Pradesh

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి తీవ్ర వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాగల రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, కడప జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.