తెలంగాణ విమోచన చరిత్రకు శాశ్వత గౌరవం కల్పించాలి
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో సెప్టెంబర్ 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని కోరుతూ భాజపా నాయకులు తహసీల్దార్ వీరాబాయికి వినతిపత్రం అందజేశారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని, చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. అమరవీరులకు గుర్తింపు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దూడల భిక్షం గౌడ్, చినుకని మల్లేశం యాదవ్, కైరంకొండ అశోక్నేత తదితరులు పాల్గొన్నారు.