సింగరేణి ఆధ్వర్యంలో వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు ఘనం
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వయోవృద్ధులను శాలువాలు, పూలబొకేలతో ఘనంగా సన్మానించారు. వృద్ధులను కుటుంబ సభ్యులు ఆదరించి ఆప్యాయంగా చూసుకోవాలని సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని వయోవృద్ధులకు శుభాకాంక్షలు తెలిపారు.