జాతీయ స్థాయి ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డుకు రేవంత్ రెడ్డి ఎంపిక
రిపోర్టర్: సతీష్
స్థలం: తెలంగాణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆర్యాడన్ మహమ్మద్ 2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు ఆయనను వరించింది. ప్రజా సంక్షేమం, రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఈ పురస్కారానికి కారణమని నిర్వాహకులు తెలిపారు. కేరళలోని నిలంబూర్‌లో శుక్రవారం సాయంత్రం జరగనున్న వేడుకలో లక్ష రూపాయల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందజేయనున్నారు.