సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాలపై లైంగిక వేధింపుల ఆరోపణలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: సిలికాన్ వ్యాలీ
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజాల లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నట్లు అమెరికా మీడియా వెల్లడించింది. ప్రముఖుల పేర్లతో కూడిన రహస్య స్ప్రెడ్షీట్ వైరల్ కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల రక్షణ కోసం మహిళలు రహస్యంగా విస్పర్ నెట్వర్క్ నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కెరీర్ నాశనమవుతుందనే భయంతో మహిళలు ఫిర్యాదు చేయడానికి వెనుకంజ వేస్తున్నట్లు కథనాలు స్పష్టం చేస్తున్నాయి.