హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో నూతన స్లిప్వేను ప్రారంభించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్
రిపోర్టర్: సతీష్
స్థలం: విశాఖపట్నం
దేశ రక్షణ రంగంలో హిందుస్థాన్ షిప్‌యార్డ్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో నూతన స్లిప్‌వేతో పాటు ఫ్లీట్ సపోర్ట్ షిప్‌ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సముద్ర జలాల పరిరక్షణతో పాటు దేశ రక్షణ బలాన్ని పెంపొందించడంలో షిప్‌యార్డ్ సేవలు ఎనలేనివని ప్రశంసించారు. మారిటైమ్ రంగానికి ఏపీ ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని వెల్లడించారు.