పారిశుద్ధ్య కార్మికులపై అసభ్యకర పోస్టులు: ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
రిపోర్టర్: B RAJESH
స్థలం: బొబ్బిలి
పారిశుద్ధ్య కార్మికుల వృత్తి మరియు కులాన్ని కించపరిచేలా సామాజిక మాధ్యమాలలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన జొన్నగుడ్డికి చెందిన ఈశ్వరరావుపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్మికులు ఎస్పీ దామోదర్ కు ఫిర్యాదు చేశారు. కుల ప్రతినిధి జలగడుగుల కామేశ్ మాట్లాడుతూ నిందితుడు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని ఆరోపించారు. పోస్టుల స్క్రీన్ షాట్లను పోలీసులకు అందజేసి చట్టపరమైన శిక్ష విధించాలని కోరారు.