కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ముప్పై రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు

రిపోర్టర్: సురేష్ స్థలం: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సెప్టెంబర్ ముప్పై నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రజా సమావేశాలు, ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించాలంటే పోలీసుల ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె స్పష్టం చేశారు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రజలు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ కోరారు.