దర్శి మున్సిపాలిటీ ఏకగ్రీవం: కూటమి ఖాతాలో మొదటి విజయం నమోదు

రిపోర్టర్: నరేష్ స్థలం: దర్శి

మున్సిపల్ ఎన్నికల్లో దర్శిలో కూటమి పార్టీ తొలి విజయాన్ని నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. నామినేషన్ వేయకుండానే వైసీపీ అభ్యర్థులు వెనుదిరగడంతో దర్శి మున్సిపాలిటీని కూటమి అభ్యర్థి ఏకగ్రీవంగా కైవసం చేసుకున్నారు. నామినేషన్లకు నిర్ణీత సమయం ముగియడంతో ఇరవై ఐదు మంది వైసీపీ అభ్యర్థులు నిరాశతో వెనుదిరిగినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం మధ్య నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.