ఫామ్-7 దరఖాస్తులపై సీఈవో సుదర్శన్ రెడ్డి తీవ్ర హెచ్చరిక
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సమర్పించే ఫామ్ దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా ఇస్తున్న ఫామ్ బల్క్ దరఖాస్తులపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందని, తప్పుడు ప్రకటనలు చేసే వారిపై ప్రాసిక్యూషన్ చేపడతామని ఆయన స్పష్టం చేశారు.