ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై వేల కోట్ల భారం: హరీశ్ రావు

రిపోర్టర్: విజయ్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక భారాన్ని ప్రజల నెత్తిన రుద్దేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. కరెంట్ కోతలు విధిస్తూ భారీ బిల్లులతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ధ్వజమెత్తారు. తక్షణమే ఈ ఛార్జీల ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.