కిమ్మూరులో ఉత్సాహంగా ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ డ్రైవ్
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: అడ్డతీగల
అడ్డతీగల మండలం కిమ్మూరులో ఉద్యానవన శాఖ, పతంజలి ఫుడ్స్ ఆధ్వర్యంలో ఆయిల్‌పామ్ ప్లాంటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారి జి. నరేంద్రకుమార్, మైక్రో ఇరిగేషన్ అధికారి ఎ. దేవదానం, శాస్త్రవేత్త డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రైతులకు ఆయిల్‌పామ్ సాగు విధానాలు, ప్రభుత్వ ఇస్తున్న డ్రిప్ సబ్సిడీ, తెగుళ్ల నివారణ చర్యలపై సంపూర్ణ అవగాహన కల్పించారు.