ఆపదలో ఉన్న యువకుడికి భరోసానిచ్చిన చైర్పర్సన్ పావని
రిపోర్టర్: Chinukani Yuvaraju
స్థలం: చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్‌గౌడ్ ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. తంగడిపల్లిలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, రోడ్డు ప్రమాదంలో వెన్నుపూస గాయంతో ఇంటికే పరిమితమైన కొండ రాజును పరామర్శించారు. యువకుని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని, నెల రోజుల ఫిజియోథెరపీ చికిత్స ఖర్చు తానే భరిస్తానని హామీ ఇచ్చారు. ఆమె సేవా దృక్పథాన్ని గ్రామస్థులు అభినందించారు.