సామాన్యులకు బిగ్ రిలీఫ్: దేశవ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖం పడుతున్న ఉల్లి ధరలు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తెలంగాణ
గత రెండు నెలలుగా ఆకాశన్నంటుతున్న ఉల్లి ధరలు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని సుమారు నూట ఇరవై ఆరు నగరాల్లో ఉల్లి ధరలు కిలోకు రూపాయి నుంచి ఇరవై ఒక్క రూపాయల వరకు తగ్గాయని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక రవాణా చర్యలు, బఫర్ స్టాక్ విడుదల కారణంగా ఈ ధరల తగ్గింపు సాధ్యమైందని నిపుణులు పేర్కొన్నారు.