పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై పోలీసుల కేసు నమోదు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: కడప
కడప జిల్లా పులివెందులలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు ఆర్వో కార్యాలయం వద్ద నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చేపట్టారని ఆయనపై ఈ చర్య తీసుకున్నారు. పోలింగ్ బూత్ లలోకి తమ ఏజెంట్లను అడ్డుకున్నారంటూ వైసీపీ నేతలతో కలిసి వైఎస్ జగన్ నిరసన ఆందోళన నిర్వహించిన విషయం విదితమే.