విశ్వం విస్తరణపై సంచలన అధ్యయనం: డార్క్ ఎనర్జీ అవసరం లేదన్న పరిశోధకులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: California

విశ్వం వేగంగా విస్తరించడానికి డార్క్ ఎనర్జీ అవసరం లేదని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు బ్లేక్ టెంపుల్ నేతృత్వంలో కొత్త అధ్యయనంలో తేల్చారు. ఐన్స్టీన్ సమీకరణాల ఆధారంగా పరిశోధనలు చేసి ఈ సంచలన విషయాన్ని వెల్లడించినట్లు పరిశోధకులు తెలిపారు. ప్రాచీన సిద్ధాంతాలను సవాల్ చేస్తూ ప్రచురితమైన ఈ తాజా వివరాలు ఖగోళ శాస్త్రంలో తీవ్ర చర్చకు దారితీశాయని, విశ్వం పుట్టుకపై కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు.