తెలంగాణలో భారీ వర్షాలు ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. పిడుగుపాటుకు గురై వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ముందస్తు చర్యగా పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.