తిరుమలలో శ్రీవారి ఎస్ఎస్డీ టోకెన్ల జారీ మరో నాలుగు రోజులు పొడిగింపు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో సాధారణ భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఎస్డీ టోకెన్ల నిలిపివేతను మరో నాలుగు రోజులు పొడిగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈనెల 24 వరకు టోకెన్ల జారీ ఉండదని, 25వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకెన్లను 24న జారీ చేస్తామని అధికారులు తెలిపారు.