పల్నాడులో వైకాపాకు భారీ షాక్: తెదేపాలో చేరిన ఛైర్పర్సన్ అభ్యర్థి కరీమూన్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: పల్నాడు
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైకాపాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పురపాలక వైకాపా ఛైర్పర్సన్ అభ్యర్థి కరీమూన్ షేక్ ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెదేపాలో చేరారు. పట్టణాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి తెదేపాలో చేరినట్లు ఆమె వెల్లడించారు. ఎన్నికల సంఘం తుది జాబితా ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఆమె పార్టీ మారడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ కార్యక్రమంలో ఆమె భర్త యూసఫ్ అలీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.