గుర్గావ్లో ఘోరం: వేగంగా దూసుకొచ్చిన కారు కిందపడి రెండేళ్ల పాప మృతి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హర్యానా
హర్యానాలోని గుర్గావ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెక్టార్ 5 ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. టైర్లు చిన్నారిపై నుంచి వెళ్లడంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. అతివేగంగా కారు నడిపి పాప ప్రాణాలు తీసిన బ్యాంక్ ఉద్యోగి నితిన్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.