బాలీవుడ్ లో కలకలం: నటుడు తుషార్ కపూర్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
రిపోర్టర్: రమేష్
స్థలం: ముంబై
బాలీవుడ్ నటుడు తుషార్ కపూర్ కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. హ్యారీ బాక్సర్ పేరుతో ఫోన్ చేసిన వ్యక్తి రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, లేదంటే హత్య చేస్తామని బెదిరించాడని అధికారులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన తుషార్ కపూర్ వారం ముందే పోలీసులను ఆశ్రయించగా, భద్రతా కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు సమాచారం.