జేఎన్‌టీయూ ఉద్యోగి సంతోష్ మృతి, వర్సిటీలో కలకలం
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయనగరం
విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న జేఎన్‌టీయూ గురజాడ పొరుగు సేవల ఉద్యోగి సంతోష్ మృతి చెందారు. పరీక్షల విభాగంలో అవకతవకల్లో తన ప్రమేయం లేకున్నా బాధ్యుడ్ని చేస్తున్నారన్న మనస్తాపంతో ఆయన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన ఒప్పంద సహాయ ఆచార్యుడు శివకుమార్‌ను విధుల నుంచి తొలగించారు.