యూపీఐ ఛార్జీలను వ్యతిరేకిస్తూ ఇండోర్లో నో యూపీఐ డే నిరసన
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఇండోర్
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో వ్యాపారులు యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత ఎమ్డీఆర్ ఛార్జీలకు వ్యతిరేకంగా నో యూపీఐ డే పాటించారు. డిజిటల్ చెల్లింపులను తాత్కాలికంగా నిలిపివేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దాదాపు 125కి పైగా వ్యాపార సంఘాలు ఈ ఆందోళనకు మద్దతు తెలిపాయి. ఈ ఛార్జీల వల్ల సామాన్య వినియోగదారులు, చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడుతుందని ట్రేడర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రతిపాదన ఉపసంహరించుకోకపోతే నగదు లావాదేవీల వైపు మొగ్గు చూపుతామని హెచ్చరించారు.