విశ్వగురు చిత్రంపై సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా కీలక ప్రకటన

రిపోర్టర్: రాజేష్ స్థలం: Mumbai

తాను నటించబోయే కొత్త సినిమా విశ్వగురు కథ ఎంతగానో నచ్చిందని, అందుకే ఈ ప్రాజెక్టును అంగీకరించినట్లు సీనియర్ నటుడు ముఖేష్ ఖన్నా తెలిపారు. ఏఎన్ఐ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ చిత్రంలో కేవలం వినోదం మాత్రమే కాకుండా దేశానికి సంబంధించిన ఒక బలమైన సామాజిక సందేశం కూడా ఉందని స్పష్టం చేశారు. యువతతో పాటు తల్లిదండ్రులు, దేశ విద్యా విధానాన్ని నడిపించే మంత్రులు తప్పకుండా ఈ చిత్రాన్ని చూడాలని ఆయన పిలుపునిచ్చారు.